Newsవిశాఖ‌పై వైసీపీది మేక‌పోతు గాంభీర్య‌మే... బాబు ఎంట్రీతో సీన్ సితారే...!

విశాఖ‌పై వైసీపీది మేక‌పోతు గాంభీర్య‌మే… బాబు ఎంట్రీతో సీన్ సితారే…!

ఎట్టకేలకు చంద్రబాబు చాలారోజుల తర్వాత  ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయవాడ వచ్చి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలని పరామర్శించారు. అయితే బాబు వచ్చిన వెంటనే తెలుగు తమ్ముళ్ళకు కొత్త ఉత్సాహం వచ్చింది. అందుకే పరామర్శకు వచ్చిన సమయంలో కూడా బాబు వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఇక కృష్ణా జిల్లా టీడీపీ నేతలంతా ఆయనతోనే నడిచారు. ఇన్నాళ్ళు హైదరాబాద్‌లో ఉంటూ, పార్టీని సమర్ధవంతంగా నడిపించిన బాబు, ఇప్పుడు డైరక్ట్‌గా యాక్షన్‌లోకి దిగి వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ శ్రేణులని యాక్టివ్ చేసి, దూకుడుగా వెళ్ళేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో విశాఖపట్నంలో కూడా బాబు అడుగు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఆ మధ్య విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు వైసీపీ శ్రేణులు బాబుని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఏదో కొద్దిమంది హడావిడి చేయడం, పోలీసులు కూడా వారి వైపే ఉండటంతో బాబుకు ఉత్తరాంధ్ర వెళ్లడానికి కుదరలేదు. కానీ ఎల్జీ గ్యాస్ పాలీమర్స్ ఘటనలో బాధితులని పరామర్శించడానికి పర్మిషన్ అడిగినా సరే వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అలాంటి పర్మిషన్స్ ఏమి లేవు కాబట్టి, త్వరలోనే బాబు విశాఖలో పర్యటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న కూడా ఇక్కడ విశాఖలో టీడీపీ వీక్ అయింది ఏమి లేదు. ఏదో వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్పా, విశాఖలో టీడీపీ ఇంచు కూడా కదల్లేదు. కొందరు నేతలు స్వార్ధం కోసం పార్టీ మారడానికి చూస్తున్నారుగానీ, ఇక్కడ టీడీపీ స్ట్రాంగ్‌గానే ఉంది. అలాగే ఇంకా చాలామంది నేతలు టీడీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.

ఇలాంటి సమయంలోనే బాబు విశాఖకు వెళితే టీడీపీకి కొత్త ఊపు రావడం ఖాయమని అర్ధమవుతుంది. బాబు వచ్చి పార్టీ నేతలకు ధైర్యం చెబితే, విశాఖలో తమ్ముళ్ళు దూకుడుగా పనిచేసుకుంటారు. పార్టీ కూడా వైసీపీకి ధీటుగా నిలబడుతుంది. బాబు విశాఖ‌లో అడుగుపెడితే అక్క‌డ పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం హీటెక్క‌డంతో పాటు రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మార‌డం ఖాయ‌మే అన్న టాక్ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news