Moviesఈ టాప్ హీరోయిన్ల ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే ఫ్యీజులు ఎగ‌రాల్సిందే..

ఈ టాప్ హీరోయిన్ల ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే ఫ్యీజులు ఎగ‌రాల్సిందే..

టాలీవుడ్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు వారికి ఉన్న డిమాండ్‌ను బ‌ట్టి రు. 2 నుంచి రు. 3 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నారు. హీరోయిన్లు ఫామ్‌లో ఉన్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌ని వ‌రుస‌గా వ‌చ్చిన ఛాన్సులు అన్ని ఒప్పుకుంటూ కోట్లాది రూపాయ‌లు వెన‌కేసుకుంటారు. హీరోల‌కు లాంగ్ కెరీర్ ఉంటుంది. హీరోయిన్ల‌కు అంత లాంగ్ కెరీర్ ఉండ‌దు. మ‌హా అయితే ప‌దేళ్లు వారు కెరీర్ కొన‌సాగిస్తేనే గొప్ప‌. అందుకే వారు ఫామ్‌లో ఉన్న‌ప్పుడు, ఛాన్సులు వ‌చ్చిన‌ప్పుడే డ‌బ్బులు లాగేస్తూ ఉంటారు.

ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సంపాద‌న ఏ రేంజ్‌లో ఉంటుందో కొన్ని అంచ‌నాలు ఉన్నాయి. ఈ అంచ‌నాల ప్ర‌కారం చూస్తే ప‌దిహేనేళ్ల‌కు పైగా ఇండ‌స్ట్రీలో ఉంటోన్న ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమాలు, యాడ్స్ ద్వారా రు. 120 కోట్ల‌కు పైగానే సంపాదించింద‌ని టాక్‌. ఆమెకు ముంబైలో భారీగా ప్రాప‌ర్టీస్ ఉన్నాయి. టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ స‌మంత‌.. సినిమాకు రు. 2 కోట్లు తీసుకుంటోంది. ఆమె అక్కినేని కోడ‌లు అవ్వ‌డంతో ఆమె క్రేజ్ మ‌రింత పెరిగింది. ఆమెకు చెన్నై, హైద‌రాబాద్‌లో భారీగా ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు చైతుతో క‌లిసి మ‌రికొన్ని ఆస్తులు కూడా కొంద‌ట‌.

హ్యాపీడేస్‌తో ఎంట్రీ ఇచ్చిన త‌మ‌న్నా సినిమాలు, ప్ర‌క‌ట‌న‌లు కూడా క‌లిపి గ‌త ప‌దేళ్ల‌లో రు. 100 కోట్ల ఆస్తులు సంపాదించింద‌ని అంటున్నారు. 2016లోనే కెరీర్ స్టార్ట్ చేసిన ర‌ష్మిక మంద‌న్నా ఇప్పుడు సినిమాకు రు. 1.5 కోట్ల నుంచి రు. 2 కోట్ల వ‌ర‌కు అడుగుతోంది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు 20 కోట్ల నుంచి రు. 25 కోట్ల వ‌ర‌కు సంపాదించింద‌ని అంటున్నారు. ఇక పూజా హెగ్డే కోలీవుడ్లో జీవా ప‌క్క‌న మాస్క్‌, తెలుగులో చైతు ప‌క్క‌న ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో సినిమాకు రు. 2 కోట్లు తీసుకునే పూజ ఇప్ప‌టి వ‌ర‌కు రు. 90 కోట్లు సంపాదించింద‌ట‌. ఆమె హిందీలో హృతిక్ ప‌క్క‌న మొహంజోదారోలో కూడా న‌టించింది. ఇప్పుడు తెలుగులో ఆమెకు వ‌రుసగా స్టార్ హీరోలే అవ‌కాశం ఇస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news