టాలీవుడ్‌లో ఈ రోజు విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం ఎంతో గొప్ప సినిమాగా నిలిచిపోయే లవకుశ సినిమా నటుడు నాగరాజు మృతి చెందారు. సీ పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకుని 1963లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే 63 కేంద్రాల్లో వంద రోజులు ఆడి సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో లవకుశల్లో లవుడిగా నాగరాజు నటించగా, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు.
వీరిలో లవుడు నాగరాజు ఈ రోజు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ గాంధీనగర్లోని తన ఇంట్లోనే మృతి చెందారు. రామయ్య సీతమ్మని అడవుల్లో వదలివేయడంతో ప్రారంభయ్యే ఈ కథలో లవకుశుల జననం, వారు రామాయణాన్ని నేర్చుకోవడం, ఊరూరా తిరిగి దానిని గానం చేయడం చివరకు రాముడితోనే వీరు యుద్ధం చేయడం లాంటి సంఘటనలతో సినిమా అప్పట్లో సంచలనం రేపింది.