చాలా మందికి డ్రింకింగ్ వ్యసనం ఉంటుంది. తాగడం తప్పుకాదు కాని.. వీరతాగుబోతులుగా మారి పదే పదే తాగుతూ జీవితంపై నిర్లక్ష్యంతో ఉండడమే తప్పు. ఈ రోజుల్లో మామూలు మనుష్యులే తాగుడుకు బానిసలు అవుతుంటే ఇక సెలబ్రిటీలు గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా రంగంలో ఉన్న వారు ఇంకెలా తాగుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కొందరు హీరోయిన్లు నాటి తరం నుంచి నేటి తరం వరకు స్టార్లుగా ఉన్న వారు తాగుడుకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు.
టాలీవుడ్లో చిరంజీవి సరసనే హీరోయిన్గా నటించిన ఊర్వశి తన సహనటుడు మనోజ్‌ను ప్రేమించి పెళ్లాడింది. అయితే ఆమె తాగుడుకు బానిస కావడంతో ఒక కూతురు పుట్టాక మనోజ్ విడాకులు తీసుకున్నాడు. ఇక కమల్‌హాసన్ రెండో భార్య సారిక కూడా పెళ్లికి ముందే కమల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమె విపరీతంగా తాగడంతోనే కమల్ ఆమెకు విడాకులిచ్చారని అంటారు.
ఇక మహానటి సావిత్రి కూడా అంతే కెరీర్ చివర్లో తాగుడుకు బానిసలు కావడంతోనే ఆమె కెరీర్ గాడి తప్పింది.అయితే సావిత్రి తాగుడుకు బానిస కావడం వెనక భర్త జెమినీ గణేషన్ చేసిన మోసాలే కారణం. ఇక ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్లలో పలు చారిత్రాత్మక సినిమాల్లో నటిస్తూ ఇంకా పెళ్లి చేసుకోని ఓ ముదురు హీరోయిన్ సైతం విపరీతంగా తాగేస్తుందన్న టాక్ ఉంది.
ఇక ఇప్పటకీ పెళ్లి చేసుకోకుండా ఓ డైరెక్టర్‌తో జీవితాన్ని ఎంజాయ్ చేస్తోన్న మరో ముదురు హీరోయిన్ సైతం ఒళ్లు తెలియకుండా తాగుతుందని టాక్. ఇక చెన్నై అందం అయిన మరో ముదురు హీరోయిన్ కూడా పార్టీల్లో పిచ్చ పిచ్చగా తాగేసి ఎంజాయ్ చేస్తుందన్నది అందరికి తెలిసిందే. బయటకు రాకపోయినా ఇటీవల కాలంలో ప్రతి హీరోయిన్ సీక్రెట్‌గా ఈ తాగుడుకు అలవాటు పడిపోయారన్నది కామన్.