గత కొద్ది రోజులుగా బంగారం రేటు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా బంగారం రేటు కొండ దిగింది. ఇది బంగారం ప్రియులకు గుడ్ న్యూసే అని చెప్పాలి. ఇక బంగారం బాటలోనే వెండి రేటు కూడా పడింది. కీలకమైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో బంగారం రేటు రు. 80 తగ్గింది… ఓవరాల్‌గా 24 క్యారెట్ల బంగారం ( 10 గ్రాములు) రూ. 53,350 కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 70 తగ్గడంతో రూ. 48,910 కు చేరుకుంది.
వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ. 80 తగ్గి రూ. 67,900 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే జాతీయ మార్కెట్లో తక్కువగా రేటు తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 40 మేర తగ్గడంతో రూ. 54,390 చేరుకుంది. రూ. 40 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,860 కి దిగొచ్చింది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం ధర ఔన్స్ కు 1947 డాలర్లకు చేరగా. వెండి ధర ఔన్స్ కు 26.87 డాలర్లకు చేరింది.