హాట్ శృంగార తార సన్నీలియోన్ ఇప్పుడు దేశంలోనే గూగుల్ సెర్చింగ్లో టాప్ ప్లేస్లో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కంటే కూడా సన్నీలియోనే సెర్చింగ్లో టాప్ ప్లేసులో ఉందంటే ఆమె కోసం భారతీయులు ఏ రేంజ్లో సెర్చింగ్ చేస్తున్నారో తెలుస్తోంది. అయితే ఈ శృంగార తారకు ఓ తీరని కోరిక ఉందట. ఎంతో కాలంగా తీరని కోరికగా ఉన్న ఈ కలను ఆమె ఇటీవలే నిజం చేసుకుంది. సన్నీకి మసెరటి లీవెంటే బ్రాండ్ లగ్జరీ కార్ అంటే చాలా ఇష్టమట.
ఈ లగ్జరీ కారు ఖరీదు రు 1.45 కోట్లు. ఈ లగ్జరీ కారును సొంతం చేసుకోవాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తోందట. ఎట్టకేలకు ఆ కోరికను సన్నీ ఇన్ని రోజులకు నెరవేర్చుకుంది. దీంతో సన్నీ ఆ కారుతో మెరిసిపోతూ తెగ మురిసిపోతోంది. ఇక ఈ కారును తాను నిన్నే ఇంటికి తీసుకు వచ్చానని… ఈ కారు నడిపిన ప్రతిసారి చాలా సంతోషంగా ఉందని మురిసిపోతోంది. ఇక ఈ ఫొటోను సన్నీ తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఇక ప్రస్తుతం సన్నీ భర్త, పిల్లలుతో సహా అత్తారింట్లోనే అమెరికాలో మకాం వేసింది.