2019 ఎన్నికలకు ముందు నుంచి నందమూరి బాలకృష్ణపై నాగబాబు టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు రిలీజ్‌కు ముందు నాగబాబు బాలయ్యను వరుసగా ఓ సీరియల్‌గా టార్గెట్‌గా చేసుకుని తన యూట్యూబ్ ఛానెల్లో విమర్శలు చేశారు. నాగబాబు వ్యాఖ్యలు ఆ సినిమాలపై అప్పట్లో గట్టిగా ప్రభావం చూపేలా కొన్ని వర్గాలు ప్రచారం చేశాయి. ఇక ఆ తర్వాత కూడా నాగబాబు బాలయ్యపై ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటున్నారు. అయితే బాలయ్య మాత్రం నాగబాబు వ్యాఖ్యలను ఎప్పుడూ పట్టించుకోలేదు.
కొద్ది రోజుల క్రితం ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ సీఎంను కలిసినప్పుడు బాలయ్యను పిలవకపోవడం కూడా వివాదానికి దారి తీయడం.. దానిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా నాగబాబు ఆవేశంతో ఊగిపోతూ విమర్శలు చేశారు. తాజాగా నాగబాబు బాలయ్య ఫొటోను ఇన్స్టార్లో షేర్ చేశాడు. పవన్ – బాలయ్య కలిసినప్పటి ఫొటో ఇది. అది కూడా బాలయ్య పవన్ తొలిసారి కలిసారట. మూడు ఫొటోలు షేర్ చేసిన నాగబాబు… ఇలాంటివి తన వద్ద చాలానే ఉన్నాయని చెప్పారు.
2 బ్రదర్స్ కలిసి .. 1 నా సోదరుడు అలాగే మరొకరు మరొక తల్లి నుండి సోదరుడు…. పవర్ స్టార్ నందమూరిలియన్ ను కలిసిన రోజు అంటూ క్యాప్షన్ జోడించాడు. ఏదేమైనా బాలయ్యపై నాగబాబు సాఫ్ట్‌గా మాట్లాడడంతో మొత్తానికి ఏదో ప్లాన్ ఉందనే చర్చలు స్టార్ట్ అయ్యాయి. బాలయ్యపై నాగబాబు ఎన్ని విమర్శలు చేసినప్పుడు కూడా ఇండస్ట్రీలో చాలా మంది నాగబాబునే తప్పుపట్టారు. ఇప్పుడు నాగబాబు బాలయ్యతో పెట్టుకోవడం కంటే సాఫ్ట్‌గా ఉంటేనే మంచిదన్న తన ఫ్యామిలీ సూచనలతోనే యూ టర్న్ తీసుకున్నాడని కొందరు చెపుతున్నారు. పార్టీల పరంగా తాము వేరు అయినా సినిమాల పరంగా తామంతా ఒక్కటే అని నాగబాబు చెపుతున్నారు.