సుశాంత్‌సింగ్ ఆత్మహత్య తర్వాత అతడి ప్రియురాలు రియా చక్రవర్తిని పలు అంశాలపై సీబీఐ అధికారులతో పాటు నార్కోటిక్ అధికారులు సైతం విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెను అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ప్రస్తుతం రియా బైకుల్లా జైలులోని ప్రత్యేక సెల్ లో ఉంది. ఇక ఇదే జైలులో 2016 నుంచి షీనాబోరో హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ కూడా ఇక్కడే ఉంది.
ఇక జైలులో రియా విందులో బియ్యం- పప్పు- 2 చపాతీలు మరియు ఒక సబ్జీ ఉన్నాయని తెలిసింది. రియా మాత్రమే కాదు.. ఆమె సోదరుడు షోయిక్ – శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్ లను కూడా జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇక సుశాంత్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోన్న క్రమంలోనే మరో ట్విస్టు బయటపడింది. తాజా సమాచారం ప్రకారం రియా ముందు డ్రగ్స్ వాడకానికి సంబంధించి ఆమె ఒప్పుకున్నది నిజం కాదని చెప్పడం మళ్లీ ఈ కేసును వేడెక్కిస్తోంది.