బిగ్‌బాస్ రెండో వారం ప్రారంభమైంది. తొలి వారం చప్పగా సాగిన గేమ్ కాస్తా రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే కాస్త పుంజుకుంది. కంటెస్టెంట్ల మధ్య చిన్న చిన్న గొడవలు కూడా షోను కాస్త ఆసక్తిగా మార్చాయి. ఇక రెండో వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంట్లో ఉన్న 16 మంది గార్డెన్ ఏరియాలో ఉన్న పడవ ఎక్కాలి. పడవ మొత్తం 9 తీరాల దగ్గర ఆగుతుంది. అలా ఆగినప్పుడు ఒక్కో సభ్యుడు దిగిపోతాడు. అలా మొత్తం 9 మంది నామినేషన్ అవుతారు. దీంతో ఎవరిని పడవ నుంచి దింపేయాలన్న చర్చ ప్రారంభమైంది. దీంతో అభిజిత్ కలుగ చేసుకుని అవ్వ ఎక్కువ సేపు పడవలో కూర్చోలేదని.. అందుకే ఆమెను ముందు దింపుదామని సలహా ఇవ్వగా ఆమె తొలి రౌండ్‌లోనే దిగిపోయి ఇంట్లోకి వెళ్లింది.
ఇక రెండో హారన్‌కు నోయల్, మూడో హారన్‌కు మోనాల్, నాలుగో హారన్ మోగగానే సోహైల్, అయిదో హారన్‌కు కరాటే కళ్యాణి దిగిపోయారు. ఇక ఆరో హారన్‌కు అమ్మ రాజశేఖర్, ఏడో హారన్‌కు కుమార్, ఎనిమిది దేత్తడి హారిక, తొమ్మదికి అభిజిత్ దిగిపోయాడు. అయితే నామినేషన్‌లోకి వెళ్లినా తిరిగి సేఫ్ అవ్వగలం అన్న నమ్మకం ఉన్న వారు పడవ నుంచి దిగేసినట్లు తెలస్తోంది.
నామినేషన్‌కు వెళితే ఎలిమినేట్ అవుతామన్న భయంతో ఉన్న జోర్దార్ సుజాత, మెహబూబ్, దివి, అఖిల్ గుట్టు చప్పుడు కాకుండా చివరి దాకా పడవలోనే ఉన్నారు. చివరికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గంగవ్వ, నోయల్, మోనాల్, సోహైల్, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, హారిక, అభిజిత్ నామినేట్ అయ్యారు. మరి ఈ వారం సేఫ్ అయ్యేది ఎవరో, ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూడాలంటే హౌస్‌పై మనం కూడ ఓ కన్నేయాల్సిందే.