టాలీవుడ్లో ప్రస్తుతం లాక్డౌన్ వేళ వరుసగా శుభకార్యాలు జరుగుతున్నాయి. కొందరు హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటే.. మరి కొందరు ఎంగేజ్మెంట్ జరుపుకుంటున్నారు. ఇక హీరోయిన్ల పెళ్లిళ్లు కూడా అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఇంట్లో సంతోషకరమైన వార్త చోటు చేసుకుంది. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ రోజు తండ్రయ్యారు. శ్రీరామ్ సుధీర్‌బాబుతో భలే మంచి రోజు, శమంతకమణి, నాగార్జున – నానితో దేవదాస్ లాంటి సినిమాలు తెరకెక్కించాడు. వైవిధ్యమైన కథలను శ్రీరామ్ బాగా ప్రజెంట్ చేస్తాడన్న పేరుంది. శ్రీరామ్ ఆదిత్య తనకు కొడుకు పుట్టిన విషయాన్ని ఆదివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
మా చిన్నారి వచ్చేశాడు.. అడ్వెంచర్ మొదలవుతోంది. శ్రీరామ్ ఆదిత్య తుర్లపాటి… ప్రియాంక తుర్లపాటి అని తను షేర్ చేసిన పోస్టర్లో తెలిపాడు. ఇక శ్రీరామ్‌కు సోషల్ మీడియాలో పలువురు శుభాకాంక్షలు చెపుతున్నారు. ప్రస్తుతం శ్రీరామ్ మహేష్‌బాబు మేనళ్లుడు గల్లా అశోక్ ( గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు) హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్.