అర్ధరాత్రి మహిళ వెళుతుంటే ఇప్పటకీ సేఫ్గా ఇంటికి తిరిగి వస్తామో ? లేదో తెలియని పరిస్థితి. ఓ సినిమా హీరోయిన్, ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే ఇక మామూలు మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ? చెప్పక్కర్లేదు. అర్ధరాత్రి సినీనటి, జాదవ్పూర్ తృణమూల్ ఎంపీ అయిన మిమీ చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును ఓ ట్యాక్సీ డ్రైవర్ వెంటాడి మరీ వేధించారు. బెంగాల్లోని బలీగుంగే ఫారీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
ఎంపీ మిమీ తాజాగా మహిషాసుర మర్థిని షోలో నటించారు. ఈ షోలో నటించిన మిమిని ఉద్దేశించి ట్యాక్సీ డ్రైవర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు మిమీ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎంపీ నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ ట్యాక్సీ డ్రైవర్ను అరెస్టు చేశారు. ఇక మిమీ బెంగాళీలో బాజీ సినిమాలో నటిస్తున్నారు. కరోనాతో ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది. అటు షోలతో పాటు ఓ వైపు లోక్సభ సమావేశాలకు సైతం వెళుతున్నారు.