పార్లమెంటుల్లోనూ, అసెంబ్లీల్లోనూ బ్లూ ఫిల్మ్‌లు చూస్తూ బుక్ అయిన ప్రజాప్రతినిధులను మన దేశంలోనే చూశాం. కర్నాటకలో కొందరు ఎమ్మెల్యేలు గతంలో ఇదే పని అసెంబ్లీలో చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. తాజాగా పార్లమెంటు సాక్షిగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశ పెడుతుంటే ఓ ఎంపీ బ్లూ ఫిల్మ్ చూస్తూ కెమేరాకు బుక్ అయ్యాడు. థాయ్‌లాండ్ పార్లమెంటులో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చదువుతుంటే అధికార పార్టీ ఎంపీ రోన్నతెప్ అనువాత్ నీలి చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేశారు.
అయితే మీడియా గ్యాలరీలో ఉన్న విలేకరులు ఈ దృశ్యం చూడడంతో పాటు తమ కెమేరాల్లో బంధించారు. పది నిమిషాల పాటు ఆయన ఈ వీడియోల్లో నిమగ్నమైపోయారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఆయన తాను ఆ చిత్రాలు చూశానని విలేకర్ల ముందు కూడా ఒప్పుకున్నారు. అయితే దానికి ఆయన చెప్పిన కారణం మాత్రం కామెడీగా ఉంది. ఆ చిత్రాల్లో ఓ మహిళ సాయం చేయాలని అర్థిస్తోందని.. అది నిజమా ? కాదా ? అని తెలుసుకునేందుకే తాను వాటిని చూశానని చెప్పారు.
ఆమె చుట్టూ ఉన్న కొందరు గ్యాంగ్‌స్టర్లు వేధిస్తుండడంతో ఆమె ఏమైనా ప్రమాదంలో ఉందా ? అని పరిశీలించేందుకే వాటిని గమనించానని చెప్పారు. ఆ తర్వాత ఆ ఫొటోలను తన ఫోన్ నుంచి డిలీట్ చేశానని కూడా చెప్పారు.