సుశాంత్‌ను రియానే కాదు ఆ హీరోయిన్ కూడా వాడుకుని వ‌దిలేసిందా…!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విష‌యంలో ర‌క‌ర‌కాల కామెంట్లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు సుశాంత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి సుశాంత్‌ను ఓ రేంజ్‌లో వాడుకుని.. అత‌డిని సాంతం నాకేసి చివ‌ర‌కు అత‌డిని తీవ్ర‌మైన ఒత్తిడికి గురి చేసింద‌ని.. ఆ ఒత్తిడి భ‌రించ‌లేకే అత‌డు చ‌నిపోయాడ‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై సీబీఐ ద‌ర్యాప్తు కూడా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక సుశాంత్‌ను రియా మాత్ర‌మే కాద‌ని.. మ‌రో హీరోయిన్ కూడా త‌న అవ‌స‌రాల‌కు వాడుకుని వ‌దిలేసింద‌న్న టాక్ ఇప్పుడు బీ టౌన్‌లో వినిపిస్తోంది.

సుశాంత్ , సారా ఆలీఖ‌న్ గ‌తంలో ఓ సినిమాలో క‌లిసి న‌టించారు. ఆ టైంలో వీరు ఒకే రూంలో ఉండేవార‌ని.. వీరు ప్రేమించుకున్నా త‌ర్వాత వీరు విడిపోయార‌న్న పుకార్లు ఉన్నాయి. దీనిపై కంగ‌న మాట్లాడుతూ సారా స్టార్ హీరో కూతురు కాబ‌ట్టే సుశాంత్‌ను వాడుకుని త‌ర్వాత బ్రేక‌ప్ చెప్పింద‌ని విమ‌ర్శించింది. ఇక సుశాంత్ థాయ్‌లాండ్‌లో జ‌రిగిన ఓ బాయ్స్ పార్టీ కోసం సారాను తీసుకువెళ్లాడ‌ట‌.

అది బాయ్స్ పార్టీ అయినా సారా వస్తాన‌ని అన‌డంతో ఆమెను తీసుకువెళ్లాడ‌ని…. ప‌బ్లిక్ ప్లైట్స్ లో వెళితే త‌ను సుశాంత్ తో స‌న్నిహితంగా ఉంటున్న విష‌యం అంద‌రికీ తెలుస్తుంద‌న్న సారా చార్టెడ్ ఫ్లైట్‌బుక్ చేయ‌మ‌ని చెప్ప‌డంతో ఆమె కోసం ప్ర‌త్యేకంగా చార్టెడ్ ప్లైట్‌నే బుక్ చేశాడ‌ట‌. ఇందుకోస‌మే సుశాంత్‌కు రు. కోటి వ‌ర‌కు చేతిచ‌మురు వ‌దిలింద‌ని టాక్‌..!