దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసును సీబీఐ సీరియస్‌గా విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఈ మూడింట్లో సీబీఐతో పాటు ఈడీ, మూడోది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇక సుశాంత్‌ది ఆత్మహత్య కాదని… అది హత్యే అని ముందు నుంచి అనుమానాలు వ్యక్తం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో ట్విస్టుల మధ్య సుశాంత్ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది.
సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుండి పదిహేను కోట్ల రూపాయలు రియా వాడుకుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు సుశాంత్ అక్కౌంట్లలో చాలా డబ్బు ఉంది. దీంతో పాటు అతడికి ముంబైతో పాటు చుట్టు పక్కల కొన్ని స్థిరాస్తులు కూడా ఉన్నాయి. బ్యాంకు ఖాతాదారులు ఎవరైనా నామినీని ఏర్పాటు చేసుకోవాలి. అంటే సదరు అక్కౌంట్ దారుడి తర్వాత ఆ లావాదేవీలకు మొత్తం నామినీయే వారసురాలు అవుతుంది. ఖాతాదారు మరణిస్తే ఆ డబ్బులు కూడా నామినీకే వెళ్లిపోతాయి.
ఇక సుశాంత్ నామినీ ఎవరో కాదు ఆమె పేరు ప్రియాంక సింగ్. ఆమె సుశాంత్ అక్కే. ఆమె భర్తే హర్యానా కేడర్ ఐపీఎస్ ఆఫీసర్. మే నెలలో సుశాంత్ చనిపోయేందుకు ఒక రోజు ముందు ఈ వాట్సాప్ చాట్ జరిగింది. మనకు అందుతోన్న సమాచారం ప్రకారం సుశాంత్ తన బ్యాంక్ అక్కౌంట్‌తో పాటు ఇతర ఇన్వెస్ట్‌మెంట్లు అన్నింటికి నామినీగా ప్రియాంకనే పెట్టాడు. ఈ విషయంలో రియాపై ఎక్కడో సందేహాలు ఉండడంతోనే అతడు రియాను నామినీగా పెట్టలేదని అర్థమవుతోంది.