కంగ‌నాకు స‌న్నీలియోన్ కౌంట‌ర్ మామూలుగా లేదుగా..

బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. తాజాగా కంగ‌న ఊర్మిళ‌పై చేసిన వ్యాఖ్య‌లు బాలీవుడ్‌లో క‌ల‌క‌లం క్రియేట్ చేశాయి. ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్ అని.. ఆమెకు అర్ధ‌న‌గ్న డ్యాన్సులే త‌ప్పా న‌ట‌న రాద‌ని కంగ‌న విమ‌ర్శించింది. ఆ వెంట‌నే ప‌లువురు కంగ‌న‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఊర్మిళ లాంటి సీనియ‌ర్ న‌టిమ‌ణిని ప‌ట్టుకుని పోర్న్ స్టార్ అన‌డం త‌గ‌ద‌ని ఊర్మిళ‌కు మ‌ద్ద‌తుగా కొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు.

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ సైతం ఊర్మిళ‌ను మ‌రోసారి ఆ మాట అన‌కుండా ఉంటార‌ని ఆశిస్తున్న‌ట్టు వ‌ర్మ చెప్పాడు. ఇక ఊర్మిళ‌ను సాఫ్ట్ పోర్న్ స్టార్ అన‌డంపై విమ‌ర్శ‌లు రావ‌డంతో కంగ‌న మ‌రోసారి స్పందించింది. తాను త‌ప్పుగా విమ‌ర్శించ‌లేద‌ని.. స‌న్నీలియోన్ లాంటి అడ‌ల్డ్ స్టార్‌ను సైతం భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ స్వాగ‌తించింద‌ని చెప్పింది. దీనిపై స‌న్నీలియోన్ త‌న  ఇన్ స్టాలో స్పందించింది.

స‌న్నీ త‌న ఇన్‌స్టాలో నీ గురించి ఎంతో త‌క్కువ తెలిసిన వాళ్లు.. ఎంతో ఎక్కువ మాట్లాడడం చాలా ఫ‌న్నీగా ఉంద‌ని చెప్పింది. దీంతో స‌న్నీ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ పోస్టుకు ఇప్ప‌టికే 4 ల‌క్ష‌ల లైక్స్ వ‌చ్చాయి. మ‌రి కొంద‌రు మాత్రం స‌న్నీ కంగాను అదిరే కౌంట‌ర్ ఇచ్చింద‌ని కామెంట్లు పెడుతున్నారు.

Leave a comment