సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు తమ పంథా మార్చుకుంటున్నారు. అబ్బాయిలకు అందమైన అమ్మాయిలతో మీటింగ్, డేటింగ్ కల్పిస్తామంటూ నమ్మించి రు. లక్షల్లో దండుకుంటున్నారు. ఫీమేల్ ఎస్కార్ పేరుతో ఈ తరహో మోసాలకు ఇటీవల ఎక్కువ జరుగుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి. లోకాంటో.కామ్, ఇండియా డేట్స్, మింగిల్ తదితర డేటింగ్ సైట్లలో ప్రత్యేక డేటింగ్ ప్యాకేజీ అంటూ పోస్టులు పెడతారు. మీకు ఏ సమయంలో అయినా ఎక్కడికి అయినా కాల్ గర్ల్స్ పంపుతామని వల విసురుతారు.
వివిధ నెంబర్లతో వీడియో కాల్స్ చేసి తర్వాత చాటింగ్ చేస్తారు. కాస్త దగ్గరయ్యాక బాధితులతో మాట్లాడిన మాటలతో కూడిన వీడియో రికార్డు చేసి తర్వాత బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. మేం అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలు బయట పెడతామని వేధిస్తారు. మరోవైపు అమ్మాయిలు, పెళ్లైన యువతులతో కూడా డేటింగ్ చేయిస్తామని వారి ఫోన్ నెంబర్లు కూడా ఇస్తామని చెపుతారు. ఆ తర్వాత సెక్యూరిటీ ఫీజు, సేఫ్టీ డిపాజిట్ కింద మరిన్ని డబ్బులు లాగుతున్నారు. ఈ క్రమంలోనే బాధితులు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు టెక్నికల్ డేటాతో వీరి గుట్టు రట్టు చేశారు.