సీనియర్ కమెడియన్ సుధాకర్ గురించి తెలియని వారు ఉండరు. రెండున్నర దశాబ్దాల క్రితం సుధాకర్ ఓ పాపులర్ కామెడీ యాక్టర్. సుధాకర్ కెరీర్ ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి అవకాశాల కోసం చెన్నైలో స్టూడియోల చుట్టూ తిరిగాడు. ఎన్నో ఇబ్బందుల తర్వాత ఓ తమిళ్ సినిమాలో అవకాశం వచ్చింది. అలా తమిళ్‌లో కెరీర్ ప్రారంభించిన సుధాకర్ ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోల పక్కన కమెడియన్‌గా తిరుగులేకుండా దూసుకుపోయాడు.
సుధాకర్‌కు కాలం కలిసి రాలేదు. అందుకే హీరోగా నిలదొక్కుకోలేదు. చివరకు కమెడియన్‌గా సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత విపరీతమైన తాగుడు, స్కోకింగ్ అలవాట్లకు బానిస అయిపోయాడు. చివరకు ఈ దురలవాట్లతో జబ్బుపడ్డాడు. అసలు కోలుకుంటాడా ? అనుకున్న టైంలో కోలుకున్నా తర్వాత కెరీర్ కొనసాగించలేకపోయాడు. జబ్బు నుంచి కోలుకున్న సుధాకర్‌కు నటించాలన్న ఆసక్తి ఉన్నా ఏ దర్శకుడు కూడా అవకాశాలు ఇవ్వలేదని తన తాజా ఇంటర్వ్యూలో వాపోయాడు.
ఇక సుధాకర్ ప్రస్తుతం జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 76 లో నివాసం ఉంటున్నాడు. సుధాకర్‌కు ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరు మైఖేల్ బెన్నీ. సుధాకర్ కొడుకుకు సినిమాలపై ఆసక్తి లేదు. అందుకే మనోడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఓ సాఫ్ట్‌వేర్ డవలపర్‌గా పని చేస్తున్నాడు.