దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిచాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో సెట్లో ఎంత తక్కువ లేదన్నా 500 మంది వరకు ఉండాలంటున్నారు. ఇంత మందితో షూటింగ్ అంటే కరోనా భయంతో ఆయన హడలి పోతున్నారు. అందుకే షూటింగ్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లడం లేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌కు చాలా గ్యాప్ రావడంతో సినిమా హైలెట్స్ ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్‌కు – పులికి మధ్య వచ్చే ఫైట్ రొమాలు నిక్క పొడుచుకునేలా ఉంటుందట. ఇది సినిమాకు మేజర్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇక దీంతో పాటు రంపచోడవరం అడవుల్లో జలపాతల మధ్యలో వచ్చే మరో ఫైట్‌తో పాటు చివర్లో వచ్చే ఫైట్ కూడా హైలెట్ అవుతుందని అంటున్నారు.
ఇక చివర్లో కదిలే ట్రైన్‌పై బ్రిటీషర్లతో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ చేసే ట్రైన్ ఎపిసోడ్ ఒళ్లు గగుర్పొడిచే రేంజ్‌లో ఉంటుందట. ఐదారు నిమిషాల పాటు ఉండే ఈ ఒక్క సీన్‌నే జక్కన్న 30 రోజుల పాటు షూట్ చేయనున్నాడట. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ చర్చ వేస్తేనే ఎన్టీఆర్ పులిఫైట్‌తో పాటు, జలపాతాల వద్ద బ్రిటీషర్లను తరిమి కొట్టే సీన్, ట్రైన్ ఎపిసోడ్ల గురించే ఒక్కటే మాట్లాడుకుంటున్నారు.