బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతికి కారణం రియా చక్రవర్తి అంటూ సోషల్ మీడియాలో మెజార్టీ జనాలు ఆమెపై తీవ్రస్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియా ఎఫైర్లు నడపడంతో పాటు సుశాంత్‌ను ఓ రేంజ్లో వాడుకుందని.. ఆమె వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. అయితే కొందరు మాత్రం రియాకు సపోర్ట్ చేసేలా మాట్లాడుతున్నారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి కొందరు చిన్నా చితకా నటుడు నిజం తెలిసే వరకు రియాను మానసికంగా వేధించవద్దని చెపుతున్నారు.
ఈ క్రమంలోనే మంచు లక్ష్మి సైతం ఆమె దోషిగా తేలకముందే మానసికంగా వేధించవద్దని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనిపై సుశాంత్ అభిమానులతో పాటు పలువురు సినీ అభిమానులు మండిపడుతున్నారు. మంచు లక్ష్మీ పోస్టుతో సుశాంత్ అభిమానులు రెచ్చిపోయారు. అటు సుశాంత్ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుశాంత్ మేనకోడలు మల్లిక సింగ్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ ఇప్పుడు సినీ కుటుంబం అంటూ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు వీరంతా ఏమయ్యారో అని ఆమె ప్రశ్నించింది. ఇక మరి కొందరు కూడా లక్ష్మీని రియాపై ప్రేమ కట్టిపెట్టూ అంటూ ట్రోల్ చేస్తుంటే తాప్సీ లాంటి వాళ్లు మాత్రం లక్ష్మిని సమర్థిస్తూ కామెంట్స్ చేశారు.