గత కొద్ది రోజులుగా రష్మిక మందన్న ఆ హీరోతో ప్రేమలో ఉందని ఒక్కటే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆమె ఓ హీరోతో నాలుగైదు సినిమాల్లో కలిసి నటించిందని ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ వార్తలపై ఆమె స్పందించింది. ఓ హీరోతో నాలుగైదు సినిమాల్లో నటించినంత మాత్రాన ఆ హీరోతో ప్రేమలో ఉన్నానని ఊహించుకుంటే ఎలా అని ఆమె వాపోతోంది. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని.. తాను ప్రస్తుతం సింగిల్‌గా, హ్యాపీగా ఉన్నానని చెపుతోంది.
ప్రతి ఒక్కరు ఇలాంటి పుకార్లు కట్టిపెట్టాలని కూడా ఆమె చెపుతోంది. ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో పాత్ర కోసం చిత్తూరు యాస నేర్చుకుంటోంది. కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న కోలీవుడ్ చిత్రం సుల్తాన్ లోనూ కన్నడ సినిమా పొగరులోనూ నటిస్తోంది.