నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్ లో వెంకీ అట్లూరి డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన సినిమా రంగ్ దే. ఈ సినిమాకు జీ టీవీ నుంచి నెగిటివ్ రైట్స్ ఆఫర్ వచ్చిందట. ఇప్పుడిప్పుడే ఈ డీల్ క్లోజింగ్ దశలో ఉందని అంటున్నారు. సితార సంస్థ రు. 40 కోట్లు కోడ్ చేసినట్టు టాక్. ఈ డీల్లో టోటల్ శాటిలైట్, డిజిటల్, థియేటర్, హిందీ డబ్బింగ్ అన్ని కలిపి ఇచ్చేస్తారన్నమాట. సంక్రాంతికి రిలీజ్ చేస్తే థియేటర్ రైట్స్‌గా రు. 20 కోట్లు, నాన్ థియేటర్ రైట్స్, అదర్ లాంగ్వేజెస్, హిందీ డబ్బింగ్ కలిపి రు. 20 వస్తాయన్నది అంచనా.
అయితే జీ టీవీ రు. 36 వరకు వచ్చి ఆగిందట. దీంతో బేరసారాలు ఇంకా సాగుతున్నాయంటున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ అక్టోబర్ నాటికి థియేటర్లు ఓపెన్ అయినా సగం సీట్లకే అనుమతి ఉంటుంది. కనీసం సంక్రాంతికి అయినా ఫుల్ సీట్లకు అనుమతి ఉంటేనే థియేటర్లలో ఈ సినిమాకు ప్లస్ ఉంటుంది. లేకపోతే అప్పుడు కూడా కష్టాలు తప్పవు. ఏదేమైనా రు. 40 కోట్లు అయినా గిట్టుబాటు చేసుకోవాలన్నదే రంగ్ దే నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది.