ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోయిన్లలో సీనియర్ హీరోలకు ధీటుగా రాణించాలన్నా… యంగ్ హీరోలతో పోటీ పడి అలవోకగా నటించాలన్నా శివగామి రమ్యకృష్ణకే చెల్లుతుంది. మూడు దశాబ్దాలకు పైగా కెరీర్ కొనసాగిస్తోన్న రమ్యకృష్ణ కెరీర్ ఇటీవల మరింత స్వింగ్‌తో దూసుకు పోతోంది. ఎప్పుడు అయితే బాహుబలి సినిమాలో శివగామి రోల్లో ఆమె చేసిందో అప్పటి నుంచి రమ్యకృష్ణతో పోటీపడి నటించాలంటే సీనియర్ హీరోలే జంకుతోన్న పరిస్థితి. బాహుబలి సినిమా రమ్యకృష్ణ నటనను ప్రపంచానికి చాటి చెప్పింది.
ఇప్పుడు రమ్యకు తెలుగుతో పాటు అటు తమిళ్లోనూ వరుసగా అవకాశాలు వస్తున్నాయి. క్షణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్లో రమ్య ఉంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ నటిస్తోన్న వకీల్‌సాబ్ షూటింగ్ చివరి దశకు వచ్చిన వెంటనే ఈ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌తో పాటు మరో హీరోయిన్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. పవన్‌కు అత్తగా రమ్యకృష్ణ నటించనుందట. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడు ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టులో పవన్‌కు అత్తగా రమ్య అంటే ఏ రేంజ్లో స్క్రీన్ షేక్ అవుతుందో ఊహించుకోవచ్చు. అత్తారింటికి దారేదిలో పవన్, నదియా మధ్య వచ్చే సన్నివేశాలు ఇప్పటకీ మర్చిపోలేం…
మరి అదే ప్లేసులో రమ్య అత్తగా, పవన్ అల్లుడిగా ఉండి వారి మధ్య డైలాగులు పేలుతుంటే అటు మాస్ ఆడియెన్స్, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఆ మాజానే వేరు. క్రిష్ మాత్రం రమ్యకు చాలా పవర్ ఫుల్ పాత్ర ఇవ్వాలని డిసైడ్ అయ్యాడంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.