టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేశాడు. రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ప్లాప్ అన్న మాటే లేదు. బాహుబలి 1, 2 సినిమాల తర్వాత రాజమౌళి పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రాజమౌళి భార్య రమా ఎవరు ? వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందన్నది కాస్త ఆసక్తికరమే.
రాజమౌళి విజయాలలో రమా కూడా ఒకరు ఉన్నారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. రమా రాజమౌళి అన్న అయిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి భార్య శ్రీవల్లికి స్వయానా చెల్లెలు. అయితే ఆమెకు ముందే ఓ వ్యక్తితో పెళ్లి అయ్యింది. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ దంపతులకు పుట్టిన వాడే కార్తీకేయ. అయితే రమా విడాకులు తీసుకున్నాక కీరవాణి ఇంట్లో ఉన్న సమయంలో రాజమౌళి ఆమెతో ప్రేమలో పడిపోవడం జరిగింది.
అలా వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక రాజమౌళి ప్రతి విజయంలోనూ రమా పాత్ర ఎంతో ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ దంపతులకు తర్వాత మరో అమ్మాయి కూడా పుట్టింది. ఇక కార్తీకేయకు ఇటీవల పెళ్లి కూడా చేశారు. సీనియర్ హీరో జగపతిబాబు అన్న కుమార్తెను కార్తీకేయ ప్రేమ వివాహం చేసుకున్నాడు.