ఇటీవల కాలంలో సెలబ్రిటీల నుంచి వారి పిల్లలు వరకు అందరూ ఎక్కువుగా ఇన్స్ట్రాగ్రామ్ అక్కౌంట్ కలిగి ఉండంతో పాటు దానిని ఫాలో అవుతుండడం కామన్ అయ్యింది. మిగిలిన సోషల్ మీడియా అక్కౌంట్ల కంటే ఎక్కువ మంది ఇన్ స్టానే ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్రకు ఇన్స్టాలో అయిదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో లేకపోయినా ఈ మాత్రం ఫాలోవర్స్ అంటే గొప్ప విషయమే.
అందులో ఆమె రెగ్యులర్గా పోస్టులు పెడుతూనే ఉంది. అయితే ఆమెకు పవిత్ర పేరుతో మరో అక్కౌంట్ ఉండడంతో పూరి అభిమానులు, ఆమె ఫాలోవర్స్ అసలు ఏది నిజమో తెలియని పరిస్థితి. దీంతో అందరూ కన్ఫ్యూజన్లో ఉండడంతో ఈ రెండు అక్కౌంట్లలో ఏది నిజమో చెప్పేందుకు పవిత్ర క్లారిటీ ఇచ్చింది. సెక్యూరిటీ కారణాల వల్ల తన మొదటి అక్కౌంట్ను తొలగించాలనుకుంటున్నానని.. అందులో ఉన్న లక్షమంది ఫాలోవర్స్ డిజప్పాయింట్ అవ్వకుండా రెండో అక్కౌంట్లో యాక్టివ్గా ఉంటానని చెప్పింది.
ఇక నా రెండో అక్కౌంట్ గురించి అందరికి తెలిశాక మొదటి అక్కౌంట్ డిలీట్ చేస్తానని చెప్పింది. ఏదేమైనా ఆమె ఒక అక్కౌంట్తో అయినా ఇన్స్టాలో ఉంటుందన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఆమె తొలి ఇన్స్టా అక్కౌంట్ను ఎందుకు డిలీట్ చేస్తోంది అన్న విషయంపై క్లారిటీ అయితే ఇవ్వలేదు.