ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకున్నా కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు వాయిదా పడుతుందో తెలియడం లేదు. ఇక ఈ సినిమా టైటిల్‌గా అయిననూ పోయిరావలె హస్తినకు ఖరారు చేయడం జరిగిందన్న ప్రచారం ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ టైటిల్‌ను ఖచ్చితంగా మార్చాలని త్రివిక్రమ్ అండ్ టీం డిసైడ్ అయ్యిందట.
ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కే ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కే సినిమాకు ఈ టైటిల్ మ్యాచ్ కాదని.. తెలుగులో ఒక టైటిల్ ఉంటే ఇతర భాషల్లో వేరే టైటిల్స్ పెడితే ప్రమోషన్లకు కూడా ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారట. దీని వల్ల సినిమా మిగిలిన భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంలో చాలా ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారట.
త్రివిక్రమ్ ఏ టైటిల్ అయినా కథకు సూట్ అయ్యేలా ఖరారు చేస్తాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్ అయిననూ పోయిరావలె హస్తినకు అన్నదే ఉంచుతారా ? లేదా ? మార్చుతారా ? అన్నది చూడాలి. పాన్ ఇండియా రేంజ్ కావడంతో నిర్మాతల వైపు నుంచి అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే టైటిల్ ఉంటే బాగుంటుందన్న సలహాలు వస్తున్నాయంటున్నారు. ఏదేమైనా ఫైనల్ డెసిషన్ త్రివిక్రమ్ చేతుల్లోనే ఉంటుంది.