సుకుమార్ పుష్ప సినిమా సెట్ మీదకు ఎప్పుడు వెళ్తుంది అన్నది ఇప్పుడు పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఈ సినిమాను ముందు చిత్తూరు అడవుల్లో కొద్ది రోజుల పాటు షూట్ చేశారు. తర్వాత కేరళ అడవులకు వెళ్లారు.. అక్కడ షూట్ అనుకుంటోన్న టైంలో కరోన రావడంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చేశారు. ఇప్పుడు మారేడుమిల్లి అడవులకు వెళ్లాలనుకున్నారు. చివరకు వికారాబాద్ అడవులు హైదరాబాద్‌కు దగ్గరగా ఉంటాయని అక్కడ షూట్ చేయాలని అనుకున్నారు.
అయితే కరోనా వచ్చినప్పటి నుంచి దర్శకుడు సుకుమార్ ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. బన్నీ చిన్నా చితకా ఫంక్షన్లకు వెళుతున్నాడు. ఇక ఇప్పుడు అడవుల్లో షూటింగ్ అంటే ముందుగా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కలిసి ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడే పుష్పకు పెద్ద దెబ్బ పడుతోంది. ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ పోలెండ్ కు చెందిన మిరోస్లా బ్రోజెక్ కరోనా వచ్చిన వెంటనే ఆ దేశానికి వెళ్లిపోయాడు. మళ్లీ ఆయన ఎప్పుడు వస్తాడు ? ఇక్కడ ఏ అడవుల్లో షూటింగ్ సెట్ చేస్తారు అన్నది క్లారిటీ రావాలి.
ఇవన్నీ ఎప్పటకి ముగుస్తాయో ? కూడా తెలియని పరిస్థితి. కరోనా భయం పూర్తిగా తొలగిపోతే తప్పా ఈ సినిమా టీం ఎవ్వరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ చూస్తుంటే మరో ఆరేడు నెలల వరకు పుష్ప సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదు. ఆ తర్వాత మరో ఏడెనిమిది నెలలు పడుతుంది. సో ఏదెలా ఉన్నా ఈ ఎఫెక్ట్ కొరటాల ప్రాజెక్టుపై గట్టిగానే పడనుంది.