గూగుల్ ట్రెండింగ్‌లో నెంబ‌ర్ 1 వెబ్ సీరిస్ ఇదే

ప్ర‌స్తుతం సినిమాల కంటే కూడా ఓటీటీలు, వెబ్‌సీరిస్‌ల హ‌వానే న‌డుస్తోంది. థియేట్రిక‌ల్ రిలీజ్‌తో పోలిస్తే ఓటీటీ రిలీజ్ అనేది చాలా క్రియేటివిటీతో ఉండాలి. అది ఏ త‌ర‌హాలో ఉన్నా కూడా ప్రేక్ష‌కుల‌ను ఎగ్జ‌యిట్ చేస్తే చాలు తిరుగులేని ఆద‌ర‌ణ ఉంటుంది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో రూపొందించిన ఓ వెబ్‌సీరిస్ ఇప్పుడు గూగుల్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీపై తెర‌కెక్కిన మసాబా మసాబా సిరీస్ సంచలనాలు సృష్టిస్తోంది.

ఈ ప్యాష‌న్ సీరిస్ ఆద్యంతం మ‌సాబా గుప్తా, నీనా గుప్తా ఈ తళ్లీ కూతుళ్ల కెరీర్‌కు సంబంధించిన జ‌ర్నీతో తెర‌కెక్కింది ఈ వెబ్ సీరిస్‌. ఇందులో ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన గుట్టు అంతా రివీల్ చేయ‌డంతో పాటు అందులో రంగుల ప్ర‌పంచంలో పోక‌డ‌లు ఎలా ఉంటాయి ?  ప్ర‌పంచ‌పు మీడియా ఎలా మారుతోంది ?  లాంటి అంశాల‌ను తెర‌పై చూపించిన తీరు ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటోంది. ప్రస్తుతం గూగుల్ లో ఈ సిరీస్ నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

ఒరిజినల్ గా ఇందులో మసాబా గుప్తా.. నీనా గుప్తానే నటించడంతో ఆదరణ మరింతగా ఉందని అంచనా వేస్తున్నారు. మసాబా మసాబాలో లైవ్ ఫ్యాషన్ ఎక్స్ పీరియెన్స్ కోసం కియారా అద్వానీ.. మాలవికా మోహనన్ మరియు ఫరా ఖాన్ వంటి నిజమైన నటులను ఎంచుకున్నారు. ఇది చాలా ప‌ద్ద ప్ల‌స్సే అని చెప్పాలి. ఇక సెల‌బ్రిటీల‌తో చికాకులు, ఇండ‌స్ట్రీ వాళ్ల‌పై మీడియ గాసిప్పుల‌తో ఎలాంటి చికాకులు ఉంటాయ‌న్న అంశాల‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. దీంతో ఇది ఇప్పుడు అంద‌రిని ఆక‌ట్టుకోవ‌డంతో పాటు గూగుల్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.