నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కలిసి నటించిన వీ సినిమా ఈ రోజు అమెజాన్ డిజిటల్ ప్లాట్ ఫాంలో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఈ సినిమాకు బ్యాడ్ టాక్ వస్తోంది. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి సరైన కథ, కథనాలు ఎంచుకోకపోవడంతో సినిమా ప్లాప్ దిశగా నడుస్తోంది. తొలి రోజు ఉదయం టాక్ బ్యాడ్‌గా రావడంతో వీ పుంజుకోవడం కష్టంగానే ఉంది. ఎన్నో అంచనాలతో వచ్చిన వీ సినిమా నానిని తీవ్రంగా నిరాశ పరిచిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన వారు ఇది నానికి మైనస్ అయితే సుధీర్‌బాబుకు చాలా ప్లస్ అయ్యిందనే అంటున్నారు.
నాని విలనిజం కొత్తగా ఉన్నా కూడా నాని పాత్ర కంటే ఏసీపీగా సుధీర్‌బాబు చేసిన పాత్రకే మంచి మార్కులు పడుతున్నాయి. దర్శకుడు ఇంద్రగంటి సుధీర్‌బాబు పాత్రను గ్రిప్పింగ్‌గా రాసుకుని.. నాని పాత్రను తేల్చేశాడనే అంటున్నారు. ఈ పాత్రను ఇంకా బెటర్‌గా రాసుకునే స్కోప్ ఉన్నా ఎందుకో ఆ దిశగా కాన్సంట్రేషన్ చేయలేదనే అంటున్నారు. సైకో విలన్‌గా ఈ పాత్రను బలంగా ఇంఫాక్ట్ చేసేంత క్రియేషన్ ఉన్నా అక్కడ ఇంద్రగంటి పట్టు తప్పేశాడు.
ఓవరాల్‌గా ఈ సినిమా నానికి మైనస్ అయ్యి.. సుధీర్‌బాబుకు ప్లస్ అయ్యిందనే అంటున్నారు. ఇప్పటి వరకు సుధీర్‌బాబు మాస్ రోల్స్ చేయలేదు. ఇందులో సుధీర్‌బాబు మాస్ పాత్రతో పాటు యాక్షన్ సీన్లలోనూ అతడిలోని మాసిజాన్ని ఎలివేట్ చేశాయి. అవే ఇప్పుడు సినిమాలో సుధీర్ బాబు పాత్ర హైలెట్ అయ్యేందుకు కారణమయ్యాయి. ఏదేమైనా నాని వీ ఓటీటీలో రావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవి మాత్రం నీరుకారిపోయాయి.