చాలా సీక్రెట్‌గా వ్యభిచార దందా నిర్వహిస్తోన్న ఓ తల్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్వాలి ప్రాంతంలో ఓ తల్లి కొడుకులు కొంత కాలంగా సీక్రెట్‌గా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. వీరు ఇతర ప్రాంతాల్లో అందమైన అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతలు, ఆర్థిక పరిస్థితులతో పాటు జల్సాలకు అలవాటు పడిన అందమైన యువతను టార్గెట్‌గా చేసుకుని ఈ వృత్తిలోకి దింపుతున్నారు.
కొద్ది రోజులుగా జరుగుతోన్న ఈ దందాపై అందుకున్న పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించి, ఐదుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దందాలో ఉన్న ఆ తల్లి ఓ లేడీ గ్యాంగ్‌స్టర్ అని పోలీసుల విచారణలో తేలింది. ఆమెతో పాటు ఆమె ఇద్దరు కుమారులు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను పిలిపించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
పోలీసులు ఆ గ్యాంగ్‌స్టర్ అమ్మాయితో పాటు ఆమె ఇద్దరు కుమారులు, ఐదుగురు యువతులపై కేసు నమోదు చేశారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.