మాజీ కేంద్ర మంత్రి రుఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. బిహార్‌లోని ఆర్జేడీ పార్టీలో గత కొన్ని దశాబ్దలుగా ఆయన కీలక నేతగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ తర్వాత ఆయన నెంబర్ టు పొజిషన్లో ఉన్నారు. ఆయన వారం క్రితం కరోనా లక్షణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇక గురువారమే ఆయన ఆర్జేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మరుసటి రోజే ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను హాస్పటల్‌కు తరలించగా కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయన హఠాన్మరణం చెందారు. ఇక రఘువంశ్ ప్రసాద్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.