భారత్‌లో అది పెద్ద మార్కెట్ కలిగి ఉన్న పబ్జీ ఇటీవల ఇక్కడ బ్యాన్‌కు గురంది. దీంతో ఇప్పుడు భారత్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు పబ్జీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. పబ్జీకి భారత్ అతి పెద్ద మార్కెట్. ఇక్కడ ఈ యాప్ నిషేధంతో పబ్జీ డవలపర్స్ భారీ నష్టాలు చూస్తున్నారు. దీంతో ఇప్పుడు పబ్జీ డవలపర్స్ చైనా స్టేక్ హోల్డర్స్‌కు బై చెప్పి ఇండియన్ గేమింగ్ దిగ్గజంతో చేతులు కలిపే దిశగా ఆలోచన చేస్తున్నారు. వరుస షాకుల పరంపరలో ఇది చైనాకు మరో పెద్ద షాకే అని చెప్పాలి.
ఈ క్రమంలోనే తమ చర్చలు సఫలమైతే భారత్‌లో తమకు పూర్త వైభవం వస్తుందని … భారత్‌లో పబ్‌జీపై బ్యాన్ లిఫ్ట్ చేస్తారని బ్లూహోల్ గట్టిగా నమ్ముతోంది. పబ్జీకి చైనా సంస్థలతో సంబంధాలు ఉండడంతో తమ యూజర్ల డేటా ప్రమాదంలో పడిందని భారత్ దీనిని నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ గేమ్‌లో ప్రధాన వాటా దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ గేమ్స్ వద్ద ఉంది. ఈ సంస్థ చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్‌తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఈ గేమింగ్ యాప్ తీసుకు వచ్చింది. 2019లో భారత్ ద్వారా దాదాపు 100 మిలియన్ డాలర్లు బ్లూహోల్ అక్కౌంట్లోకి వెళ్లాయట.
దీనిని బట్టి ఇండియాలో ఈ యాప్‌కు కోట్లలో అభిమానులు ఉన్నారని అర్థమవుతోంది. చైనాకు చెందిన టెన్సెంట్‌కు గుడ్ బై చెపితే భారత్‌లో తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పబ్జీ మేనేజ్‌మెంట్ అయిన బ్లూ హోల్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మన దేశానికి చెందిన కొన్ని గేమింగ్ సంస్థలతో బ్లూ హోల్ చర్చలు నడుపుతోంది. మనదేశంలో పబ్‌జీ లైసెన్స్ పొందేందుకు రిలయన్స్ రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి.