ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్‌లో ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ కేరీల అద్భుత ఇన్సింగ్స్‌తో ఆస్ట్రేలియా చివరి ఓవర్లో విజయం సాధించింది. ఈ ఇద్దరూ ఏకంగా 212 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆసీస్ అసాధ్యం అనుకున్న గెలుపు సుసాధ్యం చేసింది. ఆసీస్ ఒకానొక దశలో 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే అనూహ్యంగా మ్యాక్స్‌వెల్, కేరీల ఇన్నింగ్స్‌తో ఆసీస్ చివరి ఓవర్లో గెలిచింది.
ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరిగిన మూడవ వన్డేలో 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో 10 పరుగులు కావాల్సి ఉండగా.. ఆసీస్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. మ్యాక్స్‌వెల్ 108, క్యారీ 106 పరుగులతో ఆసీస్‌కు తిరుగులేని థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఏదేమైనా స్వదేశంలో ఐదేళ్లుగా వన్డే సీరిస్ కోల్పోని ఇంగ్లండ్ ప్రపంచ ఛాంపియన్‌గా ఉండి కూడా వన్డే సీరిస్ కోల్పోయింది.
ముందుగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 112, బిల్లింగ్స్ 57 పరుగులు చేశారు. ఇక ఆసీస్ ఆస్ట్రేలియా మరో రెండు బంతులు మిగిలి ఉండగా 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.