టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబుకు పుస్తకాలు చదివే అలవాటు బాగానే ఉంది. ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో మహేష్ కొన్ని పుస్తకాలు చదివాడట. ఈ క్రమంలోనే తాను చదివిన ఓ మంచి పుస్తకం గురించి ట్విట్టర్లో తన అభిప్రాయం పంచుకున్నాడు. ఆ పుస్తకం తనను ఎందుకు ఆకట్టుకుందో కూడా చెప్పాడు. మహేష్ మెచ్చిన ఆ పుస్తకం పేరు థింక్ లైక్ ఏ మాంక్. ఈ పుస్తకాన్ని రచించింది జే శెట్టి అనే పాపులర్ రచయిత.
ఇక జే శెట్టి ఒకప్పుడు సన్యాసి. మూడేళ్ల పాటు సన్యాసిగా జీవితం గడిపిన అతడు ఈ పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ప్రతి మనిషి మనస్సుతో ఎంత ప్రశాంతంగా ఉండాలి ? అనే అంశంతో పాటు సన్యాసిగా తన అనుభవాల నుండి ఈ పుస్తకం రాశారు. ఇక ఈ పుస్తకంలో అంశాలు మహేష్‌కు పిచ్చ పిచ్చగా నచ్చడంతో దీనిని చదివిన మహేష్ ట్విట్టర్లో తన అభిప్రాయం పంచుకున్నాడు.
జే శెట్టి రాసిన ఈ పుస్తకం చదవుతున్నంత సేపు రచయిత మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇలాంటి అనుభూతి అరుదుగా దొరుకుతుందని చెప్పాడు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఇది అని తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇక మహేష్ ఈ పుస్తకానికి ఇంత గొప్ప ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడంటే ఇది గొప్ప పుస్తకమే అయ్యి ఉంటుందని అనుకోవచ్చు. మరి మీరు కూడా పుస్తక ప్రియులు అయితే ‘థింక్ లైక్ ఏ మాంక్’ పుస్తకాన్ని కొని చదవాల్సిందే.