బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌కు, మహారాష్ట్ర సర్కార్‌కు మధ్య నడుస్తోన్న యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా ఈ రోజు ఆమె హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబై బయలు దేరిన సంగతి తెలిసిందే. ఆమె ముంబై చేరుకోకుండానే మహారాష్ట్ర సర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది. అనుమతులు లేకుండా కర్ణిక ఆఫీస్ నిర్మించారంటూ ఆరోపించింది. నిన్న నోటీసులు జారీ చేసిన బీఎంసీ అధికారులు ఈ రోజు నుంచే కూల్చివేతకు దిగారు. అనుమతి లేకుండా ఆఫీసులో మార్పులు చేశారంటూ నిన్న నోటీసులు ఇంటికి అంటించి ఈ రోజు నుంచే జేసీబీలతో ఆఫీసును కూల్చివేస్తున్నారు.
దీంతో కంగనా ఫైర్ అయ్యారు. తన ఆఫీస్ కూల్చివేతపై కంగనా ఫైర్ అవ్వడంతో పాటు తన ఆఫీస్‌ను రామాయలంతో పోల్చింది కంగనా. బీఎంసీ బాబర్ ఆర్మీలా తయారైందని తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని బాబర్ కూల్చివేస్తే తన ఆఫీసును ఇప్పుడు బీఎంసీ కూల్చివేస్తోందని మండిపడ్డారు. కూల్చివేసిన తన ఆఫీస్‌ను ఎలా నిర్మించుకోవాలో తెలుసు అని చెప్పిన కంగనా ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు.