కరోనా రాజకీయ నేతలను ఎలా వెంటాడుతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే కేరళ ఏపీలోనూ పలువురు మంత్రులు ఇప్పటికే కోవిడ్ భారీన పడ్డారు. ఇక తాజాగా కేరళ కేబినెట్లో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. కేరళ ఆర్థికమంత్రి డాక్టర్ థామస్ ఐస్సాక్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కేరళ కేబినెట్లో కరోనా భారీన పడ్డ తొలి మంత్రి అని సమాచారం. ఇక ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్దారణ అయ్యింది.
ఈ క్రమంలోనే ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లడంతో పాటు గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు స్వీయనిర్బంధంలోకి వెళ్లాలని కోరారు. ప్రస్తుతం మంత్రి థామస్‌ను తిరువనంతపురపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక గత 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 3,082 కొత్త కరోనా కేసులు బయటపడగా 10 మంది మరణించారు. ఇప్పటిరవరకు కేరళలో 87 వేల కేసులు నమోదు అయ్యాయి.