కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు తెలిసినంత వరకు ఆమె తొలి తెలుగు సినిమా నేను శైలజ. 2016 లో రామ్ సరసన నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు తొలి సినిమా శైలజ కాదట. ఆమె బయట ప్రపంచానికి తెలియనప్పుడే ఓ తెలుగు సినిమాకు సైన్ చేసింది. ఆ సినిమా టైటిల్ ఐనా ఇష్టం నువ్వు. ఈ సినిమాతోనే సీనియర్ నరేష్ వారసుడు నవీన్ కృష్ణ హీరోగా పరిచయం కావాల్సింది. సీనియర్ నిర్మాత చంటి అడ్డాల నిర్మాతగా ఈ సినిమాను నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకుడు.
వివాదాల్లో ఉండడంతో ఈ సినిమా ఇప్పటకీ రిలీజ్ కాలేదు. అయితే ఎట్టకేలకు టైటిల్ మార్చి జానకి నేను పేరుతో ఆ మూవీని రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమా అక్టోబర్లో ఓటీటీలోరి రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమను వెంటాడుతోన్న వివాదాలు ఇంకా కొలిక్కి రాలేదు. చంటి అడ్డాల నుంచి ఈ సినిమా రైట్స్ తాను కొన్నానని.. నట్టికుమార్ వాదిస్తున్నాడట. ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని నట్టి చెపుతున్నట్టు ఇండస్ట్రీ టాక్.
ఏదేమైనా కీర్తి ఎవరో తెలియనప్పుడు ప్రారంభమైన ఈ సినిమా సీక్రెట్ మొత్తానికి అలా మరుగున పడింది. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్కు రెడీ అవుతోంది.