మన జీవితంలో అతి ముఖ్యమైన వాటిలో డబ్బు ఒకటి. డబ్బు ఉన్నప్పుడు ఎందరో దగ్గర అవుతారు. డబ్బు లేనప్పుడు వాళ్లే దూరం అవుతారు. డబ్బు చేతిలో ఉన్నప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలి. దానిని సరైన మార్గంలో పెట్టకపోతే మన జీవితం పైనుంచి కింద పడేందుకు ఎంతో టైం పట్టదు. ఈ విషయం బిహార్‌కు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ సుశీల్ కుమార్ విషయంలో మరోసారి ఫ్రూవ్ అయ్యింది. 2011లో అమితాబ్ కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో రు.. 5 కోట్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశాడు.
సాధారణ వ్యక్తి అయిన సుశీల్ అంత డబ్బు గెలుచుకోవడంతో దానిని జాగ్రత్తగా వాడుకుంటూ ఎంతో మంచిగా ఉంటాడనే అందరూ అనుకుని ఉంటారు. అయితే ఆ డబ్బే అతడిని దురలవాట్లకు దగ్గర చేసింది. డబ్బు వచ్చాక అతడి జీవితంలోకి మద్యం, సిగరెట్లు, చెడు స్నేహాలు చేరాయి. దగ్గరివాళ్ల చేతిలో మోసపోవడమే కాకుండా భార్యతో సంబంధాన్ని తుంచేసుకున్నాడు. ఇలా కౌన్ బనేగాలో వచ్చిన డబ్బును సరిగా వాడుకోకపోవడంతో తన జీవితం నాశనమైందని సుశీల్ తన ఫేస్‌బుక్ పేజీలో సవివరంగా వివరించారు.