ఊర్మిలపై కంగ‌నా పోర్న్ స్టార్ డైలాగ్‌… వ‌ర్మ కౌంట‌ర్‌

బాలీవుడ్ క్వీన్ ఫైర్‌బ్రాండ్ కంగ‌న త‌న‌ను ఎవ‌రైనా అంటే వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చేస్తోంది. బాలీవుడ్లో 90 శాతం మంది డ్ర‌గ్స్ తీసుకుంటార‌ని కంగ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌పై రాజ్య‌స‌భ ఎంపీ జ‌యాబ‌చ్చ‌న్ స్పందించి ఆ వ్యాఖ్య‌లు కొట్టేసింది. ఇక జ‌యా వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తూ ఊర్మిళ స్పందించింది. బీజేపీ మ‌ద్ద‌తు కోసమే ఆమె ఈ వ్యాఖ్య‌లు చేసి ఉండ‌వ‌చ్చ‌ని అన్న ఊర్మిళ‌.. ఆమె బీజేపీ సీటు కోస‌మే ఈ వ్యాఖ్య‌లు చేసి ఉండ‌వ‌చ్చ‌ని చెప్పింది. ఊర్మిళ‌ వ్యాఖ్యలకు కంగనా చాలా సీరియస్ అయ్యింది.

 

కంగ‌న త‌న తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ పోర్న్ స్టార్ టికెట్ సాధించగలిగితే… మ‌రాఠా గొప్ప‌త‌నం చెప్పిన తాను సీటు సాధించ‌డం ఏ మాత్రం క‌ష్టం కాద‌ని ఊర్మిళ‌కు కౌంట‌ర్‌గా మాట్లాడింది. ఊర్మిళ‌ను పోర్న్‌స్టార్ అన‌డంపై కొంద‌రు కంగ‌నాపై విమ‌ర్శ‌లు చేస్తుంటే.. మ‌రి కొంద‌రు కంగ‌న‌ను స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక చాలా మంది మాత్రం న‌టిగా మంచి పేరున్న ఊర్మిళ‌ను ఇలా అన‌డం క‌రెక్ట్ కాద‌ని.. కంగ‌న నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతోంద‌ని ఎక్కువ మంది విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

 

ఇక త‌న శిష్యురాలు ఊర్మిళ‌ను పోర్న్‌స్టార్ అన‌డంపై వ‌ర్మ ట్విట్ట‌ర్‌లో స్పందించాడు. నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఊర్మిలను ఇలాంటి మాటలు అనడం స‌రికాద‌న్న వ‌ర్మ‌… మ‌ళ్లీ ఇలాంటి మాట‌లు విన‌వ‌ద్ద‌ని ఆశిస్తున్నాన‌ని పేర్కొన్నాడు. మ‌రి వ‌ర్మ రియాక్ష‌న్‌కు కంగ‌నా కౌంట‌ర్ ఉంటుందా ? అన్న‌ది చూడాలి.