బాలీవుడ్‌లో లిప్‌లాక్‌లు రెండు, మూడు దశాబ్దాల నుంచే ఫేమస్. కానీ తెలుగులో గత ఐదారేళ్లుగా ఈ లిప్‌లాక్‌లు బాగా ఫేమస్ అయ్యాయి. ఇక స్టార్ హీరోలు లిప్‌లాక్ ల విషయంలో కాస్త హద్దుల్లోనే ఉంటుంటారు. తెరపై ఘాటు రొమాన్స్ చేసేందుకు వారు పెద్దగా ఇష్టపడరు. ఇలాంటి వారిలో కోలీవుడ్ క్రేజీ హీరో సూర్య ఒకరు. ఇలాంటి ఘాటు రొమాన్స్ సన్నివేశాలు సూర్య సినిమాల్లో చాలా తక్కువుగా ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం సూర్యతో కలిసి కాజల్ బ్రదర్స్ సినిమాలో నటించింది.ఈ సినిమాలో కాజల్, సూర్య లిప్ లాక్ చేయడం చాలా మందికి అప్పట్లో షాకింగ్ న్యూస్ అయ్యింది.
కాజల్‌కు చాలా మందితో లిప్‌లాక్ చేసిన అనుభవం ఉన్నా.. సూర్యకు మాత్రం అదే తొలి అనుభవం. జ్యోతిక సాధారణంగా సూర్య లిప్‌లాక్ చేసేందుకు ఒప్పుకోదన్న టాక్ ఉంది. మరి సూర్య కాజల్‌తో ఎలా లిప్ లాక్ చేశాడన్న సందేహాలు వచ్చాయి. అయితే చాలా యేళ్ల తర్వాత ఈ లిప్‌లాక్‌పై కాజల్ క్లారిటీ ఇచ్చింది. ఆ లిప్‌లాక్ ఫేక్ లిప్ లాక్ అట. ఈ విషయాన్ని ఆమె తన తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.
ఆ లిప్ లాక్ సీన్ చేసేటప్పుడు సూర్య చాలా ఇబ్బంది పడ్డాడట. దీంతో దర్శకుడు కెవి. ఆనంద్ ముందు సూర్యను కుర్చీలో కూర్చోబెట్టి ఒక గ్లాస్‌పై ముద్దు పెట్టించాడట… ఆ తర్వాత కాజల్‌ను కూడా కూర్చోపెట్టించి ఓ బొమ్మ మీద ముద్దు పెట్టించాడట. ఆ తర్వాత రెండు సీన్లను విజువల్ ఎఫెక్ట్స్ టీంకు అప్పగించి సూర్య, తాను లిప్‌లాక్ చేసినట్టుగా సీన్‌ను మార్చారని చెప్పింది. అయితే అది చూసేందుకు ఒరిజినల్ లిప్‌లాక్‌గా ఉన్నట్టు అనిపిస్తుందని కాజల్ చెప్పారు. ఏదేమైనా అందరూ ఒరిజినల్ లిప్ లాక్ అనుకున్న దానిని కాజల్ ఫేక్‌లిప్ లాక్‌గా తేల్చి పడేసింది.