ఈ రోజు మృతిచెందిన జయప్రకాశ్ రెడ్డికి పలువురు తమ నివాళులు అర్పిస్తున్నారు. రాయలసీమ యాసలో జయప్రకాశ్ చెప్పిన డైలాగులు, ఆయన విలనిజం, కామెడీ అన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటకీ మర్చిపోలేరు. ఆయన మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం తమ సంతాపం వ్యక్తం చేశారు. ఇక కొద్ది రోజులుగా కరోనా లాక్‌డౌన్ వల్ల ఆయన గుంటూరులోని తన ఇంట్లోనే ఉంటున్నారు. ఈ రోజు ఉదయం బాత్‌రూమ్‌కు వెళ్లిన అక్కడే కుప్పకూలిపోయారని భార్య రాజ్యలక్ష్మీ తెలిపారు.
ఇదిలా ఉంటే ఆయన సినిమాల్లోకి రాకముందు టీచర్‌గా పనిచేశారు. జేపీ తండ్రి సీఐగా పనిచేశారు. ఆ తర్వాత జేపీకి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరితే తన కుమారుడు ఎక్కడ లాంచలు తీసుకుంటాడో ? అని తండ్రి ఆ ఉద్యోగంలో చేరవద్దని జేపీకి చెప్పారు. అయితే జేపీ సినిమాల్లోకి వచ్చి కోట్లమంది ప్రజలను మెప్పించినా తన తండ్రిని బైక్‌పై కూర్చోపెట్టుకుని తిప్పాలన్న కోరిక ఉండేదని.. అది మాత్రం తీరలేదని జయప్రకాష్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు.