తెలుగు బుల్లితెరపై ఎంత మంది యాంకర్లు వచ్చినా సుమను కొట్టేవాళ్లే లేరు. యాంకర్ సుమ ఎప్పుడు బుల్లితెర ప్రోగ్రామ్‌లు, ఆడియో ఫంక్షన్లు, ఇతర టీవీ షోలతో బిజీగా ఉంటుంది. గత రెండు దశాబ్దాలకు పైగా ఎంతో మంది యాంకర్లు వస్తున్నారు.. వెళుతున్నారు. కానీ సుమ రేంజ్ ఏ యాంకర్‌కు రాలేదు. సుమ ఆధునిక యాంకర్లలా కాకుండా ఇప్పటకీ సంప్రదాయ పద్ధతిలోనే ఉంటూ యాంకరింగ్ చేసి ప్రేక్షకులను మెప్పించడంలో ఆమెకు ఆమే సాటి.
ఆమె ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలకు భార్య. అయితే వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయన్న రూమర్లను సింపుల్‌గా ఓ పోస్టుతో కొట్టిపడేసింది సుమ. సుమ స్వతహాగా మళయాళి అయినప్పటకీ ఆమె తెలుగు ఎంత స్పష్టంగా పలుకుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బుల్లితెరపై సుమ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకు సమ పిన్ని కూడా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే. మంజులా నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చక్రవాకం సీరియల్లో నటించిన ఇందూ ఆనంద్ సుమకు స్వయానా పిన్ని.
ఇందూ ఆనంద్ కేరళకు చెందిన నటి. ఆమె ముందు హిందీ సిరియల్స్‌లో నటించి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల సీరియల్స్‌లో నటిస్తోంది. ఇందూ ఆనంద్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి ఎదగడం నిజంగా గొప్ప విషయమే.