బిగ్‌బాస్‌లో అంద‌రికి ఆమే టార్గెట్ అయ్యిందా..!

మొత్తానికి బిగ్‌బాస్‌ను ఆదివారంతో ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశాడు నాగార్జున. సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్న వారి ముసుగులు తొల‌గించేసి ఎవ‌రి గురించి ఎవ‌రి మ‌న‌స్సులో ఏముందే చెప్ప‌క‌నే చెప్పేశాడు. ఇక తాజా ప్రోమోను బ‌ట్టి చూస్తే హీరో – జీరో టాస్క్‌లో త‌న‌ను టార్గెట్ చేయ‌డంతో పాటు దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసిన రిపోర్ట‌ర్ దేవి నాగ‌వ‌ల్లిపై అమ్మ రాజ‌శేఖ‌ర్ కోపంగా ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది.

 

 

అమ్మ రాజ‌శేఖ‌ర్ అరియానాతో మాట్లాడుతూ దేవిపై క‌స్సుబుస్సులాడాడు. తాను డైరెక్ట‌ర్ అయితే నేను రిపోర్ట‌ర్ అంటూ అరిచింద‌ని.. దేవి మామూల్ది కాదు.. తాను గెల‌వ‌డం కోసం ఎవ్వరిని ఏమైనా చేస్తుందని రాజ‌శేఖ‌ర్ తెలిపాడు. ఇక వీకెండ్‌ ఎపిసోడ్లో దేవితో పాటు లాస్య సైతం మాస్ట‌ర్‌ను జీరో అన‌డంతో ఆయ‌న తీవ్ర భావోద్వేగానికి గుర‌వ్వ‌డం నాగార్జున నుంచి చివ‌ర‌కు గంగ‌వ్వ వ‌ర‌కు అత‌డిని స‌ముదాయించ‌డం జ‌రిగాయి.

 

ఏదేమైనా త‌న‌ను టార్గెట్ చేసిన వారి విష‌యంలో రాజ‌శేఖ‌ర్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాల‌ని డిసైడ్ అవ్వ‌డంతో షో‌ మరో మలుపు తిరగబోతుందని అర్థమవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మాస్టర్‌లో ఈ కోణం కూడా ఉందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హౌస్‌లో రాజ‌శేఖ‌ర్‌కు స‌పోర్ట్ ఎక్కువ ఉండ‌డంతో పాటు దేవి అంద‌రు త‌న‌ను టార్గెట్ చేస్తున్నార‌ని. గ్రూపిజం ఉంద‌ని చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు ఆమె అంద‌రికి టార్గెట్ అయ్యే ఛాన్సుల‌పై కూడా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

Leave a comment