Gossipsశ‌ర్వానంద్ పెళ్లి పెద్ద‌గా ఉపాస‌న‌... అస‌లు కిటుకు అదే..!

శ‌ర్వానంద్ పెళ్లి పెద్ద‌గా ఉపాస‌న‌… అస‌లు కిటుకు అదే..!

యంగ్ హీరో శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అన్న విష‌యం తెలిసిందే. శ‌ర్వానంద్ ప్రేమ‌లో ఉన్న అమ్మాయి కూడా కామినేని ఫ్యామిలీకే చెందిన అమ్మ‌యి అట‌. ఆమె రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న‌కు క‌జిన్ అవుతుంది. ఇక రామ్‌చ‌రణ్‌, శ‌ర్వానంద్ ఇద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులు కాగా… ఇప్పుడు వీరుద్ద‌రు మ‌రింత ద‌గ్గ‌ర బంధువులు అవుతున్నారు. ఇక చ‌ర‌ణ్‌కు కామినేని ఫ్యామిలీతో ఉన్న ప‌రిచ‌యం నేప‌థ్యంలోనే శ‌ర్వాకు కూడా ఆ అమ్మాయి ప‌రిచయం అయ్యి ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీ టాక్‌.?

Sharwanand Movies, News, Photos, Age, Biography

ఇక శ‌ర్వా ప్రేమను పెళ్లి వ‌ర‌కు తీసుకు వెళ్లే విష‌యంలో ఉపాస‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ట‌. అటు వైపు అమ్మాయి త‌ర‌పు వాళ్ల‌ను ఈ పెళ్లికి ఒప్పించ‌డంలో ఉపాస‌నే బాధ్య‌త తీసుకుంద‌ని తెలుస్తోంది. అయితే శ‌ర్వానంద్ ప్రేయ‌సి ఎవ‌రు అన్న‌ది మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. ఈ విష‌యాన్ని గోప్యంగానే ఉంచుతున్నారు. అయితే ఆమె మాత్రం ఉపాస‌న‌కు వ‌రుస‌కు క‌జిన్ అవుతుంద‌ని అంటున్నారు. త‌నకు క‌జిన్ అయినందునే ఉపాస‌న శ‌ర్వా పెళ్లి విష‌యంలో ఇంత కేర్ తీసుకుంద‌ట‌.

Upasana Kamineni Age, Biography, Wiki, Husband, Family

ఏదేమైనా టాలీవుడ్‌లో లాక్‌డౌన్ నేప‌థ్యంలో వ‌రుస పెట్టి యంగ్ హీరోలు పెళ్లి పీట‌లు ఎక్కేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో శ‌ర్వా కూడా చేరిపోతున్నాడు. ఇక అఖిల్‌కు ముందుగా ఎంగేజ్మెంట్ అయిన శ్రియా భూపాల్ కూడా ఉపాస‌న‌కు బంధువే. అయితే ఆ ఇద్ద‌రి బంధం ఎంగేజ్మెంట్‌తోనే క్యాన్సిల్ అవ్వ‌గా ఆ త‌ర్వాత శ్రేయా భూపాల్‌కు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కుమారుడితో పెళ్లి అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news