కొద్ది రోజులుగా తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక ఈ వేడి నుంచి భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకుని ఆహ్లాదకరంగా మారడంతో పాటు ఈ రోజు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని ఫిలీంనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో భారీ వర్షం కురిసింది.
ఇక సైదాబాద్, మలక్‌పేట, ముషీరాబాద్, చాదర్‌ఘాట్, రాంనగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కూడా భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్ర వేడిమితో ఉక్కపోతకు గురవుతోన్న నగర ప్రజలకు మొత్తానికి భారీ వర్షంతో ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో రోడ్డుపైకి వర్షపునీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.