గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వడ్లమూడి గోపినాథ్ (30) స్థానికంగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే రేపల్లెకు చెందిన ఓ యువతి సైతం డ్యాన్స్ నేర్చుకునేందుకు చేరింది. వారిద్దరు కళాశాల స్నేహితులే కావడంతో ప్రేమలో పడ్డారు. ఐదేళ్లుగా వారు ప్రేమలో ఉన్నారు. మూడు నెలల క్రితమే గోపీనాథ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సదరు యువతి గోపీనాథ్‌ను దూరం పెట్టింది. ఆమె ఫోన్‌కు కూడా అందుబాటులోకి రాలేదు.
అయితే బెల్లంకొండ మండలంలో ఆమె పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తూ నివాసం ఉంటోన్న ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంట్లో లేకపోవడం చూసి గదిలోకి వెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు ఇంట్లో దొంగ దూరాడాని భావించి బయట తలుపు పెట్టారు. ఊరంతా అక్కడకు చేరుకుంది. ఈ లోగా గోపీ గడియ తీయాలని తలుపులు తట్టినా తీయలేదు. చివరకు పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి తీయగా అతడు లోపల ఉరేసుకుని మృతి చెందాడు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఆ యువతి ప్రేమ తిరస్కరించడంతో గతంలోనూ గోపీనాథ్ ఆమెను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేయడంతో పాటు మూడు సార్లు పురుగుల మందు తాగి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడని చెపుతున్నారు. అప్పుడు కూడా ఆ యువతి గోపీపై ఫిర్యాదు చేసినా మారలేదు. చివరకు అతడి జీవితాన్ని ఇలా ముగించుకున్నాడు.