ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. సొంత ఇళ్లు ఎవరు అయితే కట్టుకుంటున్నారో ? వారికి ప్రస్తుతం ఉన్న రుణాల వడ్డీ రేటుపై ఆఫర్లు ఇచ్చింది. గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే రుణగ్రహీతలకు మూడు ఆఫర్లు ఇస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు రద్దు: ఇక రుణాలకు దరఖాస్తు చేసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అలాగే రు. 30 లక్షలకు పై బడి, కోటి రూపాయల కంటే తక్కువ రుణాలపై సిబిల్ స్కోరు ఎక్కువ రుణ గ్రహీతలకు రు. 10 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు.
అయితే ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా అయితే మరో 0.5 శాతం రాయితీ ఉంటుంది. ఈ రాయితీతో రుణం మొత్తంపై 0.40 శాతం వరకు వినియోగదారులకు కలిసొస్తుంది. ఉదాహరణకు, 30 లక్షల రుణంపై 15 సంవత్సరాల కాల పరిమితిలో 1.52 లక్షల వరకు కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుంది.