సమాజంలో అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా కొందరు వారిని నమ్మించి వంచిస్తున్నారు. కొందరు కామాంధులు మాత్రం తమతో ఎంత స్నేహంగా ఉంటోన్న అమ్మాయిలను కూడా వదలకుండా లైంగీక దాడులకు పాల్పడుతున్నారు. యూపీలోని ప్రయోగరాజ్ బెనిగంజ్ ప్రాంతానికి చెందిన ఓ యువతి స్థానికంగా బ్యుటీషియన్గా పనిచేస్తోంది. కొందరు యువకులతో ఆమెకు పరిచయం ఉంది. వీరంతా బెస్ట్ఫ్రెండ్స్గా ఉంటున్నారు. ఇటీవల ఓ యువకుడి బర్త్ డే పార్టీకి ఆమెను పిలిచారు. ఆ తర్వాత ఆమెను సామూహికంగా రేప్ చేశారు.
బర్త్ డే పార్టీ ఉందని సులేం సారాయ్ అనే వ్యక్తి యువతిని ఇంటికి పిలిచాడు. ఆ యువతి పార్టీకి వెళ్లేసరికే అక్కడికే మిగిలిన ఫ్రెండ్స్ ఉన్నారు. కేక్ కటింగ్ తర్వాత ఆ యువతి వారితో కలిసి మందు పార్టీలో పాల్గొంది. ఆ తర్వాత ఆమె మత్తులోకి జారుకుందో లేదో ? వారు పాడుబుద్ధి చూపించారు. ఒక్కొక్కరు ఆమెపై అత్యాచారం చేశారు. యువతి మత్తు నుంచి తేరుకున్నాక జరిగిన ఘోరం చూసి ఆమె భోరున ఏడ్చేసింది.
ఆ వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ యువకులు పరారయ్యారు. పోలీసులు ప్రధాన నిందితుడు సులేం సారాయ్తో పాటు మిగతావారి కోసం అన్వేషిస్తున్నారు.