ప్రముఖ కమెడియన్, హీరో సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ భీమవరంలో కలిసి చదువుకున్నారు. సునీల్‌ది ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం. ఇక ఇండస్ట్రీలోకి వచ్చాక సునీల్ ముందు టాప్ కమెడియన్‌గా ఎదిగి.. ఆ తర్వాత హీరో అయ్యాడు. హీరోగా మారాక సునీల్ ఆరంభంలో వరుసగా హిట్లు కొట్టాడు. ఆ తర్వాత సునీల్ చేసిన సినిమాలు అన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి.
ఇక మళ్లీ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు రవితేజ డిస్కోరాజా సినిమాలో విలన్‌గా కూడా నటించాడు. ఇక సునీల్ శృతి ఇందుకూరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా సునీల్‌కు తెలిసిన కుటుంబం అమ్మాయే. సునీల్‌ది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు. అయితే సునీల్ ఫ్యామిలీ బయట పెద్దగా కనిపించదు.