టాలీవుడ్‌లో చిన్న చిన్న క్యారెక్టర్లతో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. నాని పక్కన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించిన విజయ్‌కు ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతాగోవిందం సినిమాలతో విజయ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోవడం ఒక ఎత్తు అయితే. ఈ సినిమాల కలెక్షన్లతో పాటు విజయ్ యాట్యిట్యూడ్‌కు యూత్‌లో విపరీతమన క్రేజ్ రావడంతో టాలీవుడ్ సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు సైతం షాక్ అవ్వాల్సిన పరిస్థితి.
ఇక విజయ్ నటించిన ద్వారకా సినిమా ప్లాప్ అయ్యింది. ఇక నోటా ఓ మోస్తరుగా ఆడగా, డియర్ కామ్రేడ్‌తో పాటు ఈ యేడాది నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు సైతం ప్లాప్ అయ్యాయి. దీంతో విజయ్ మార్కెట్ వరుస ప్లాపులతో డల్ అయ్యిందనే చెప్పాలి. అంతకు ముందు సినిమాకు రు. 50 లక్షలు తీసుకున్న విజయ్ వరుస బ్లాక్‌బస్టర్లతో తన రేటు రు. 7 కోట్లకు పెంచాడు.
వరల్డ్ ఫేమస్ లవర్‌కు అయితే రు. 10 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినా ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో నిర్మాతలు, బయ్యర్లు నష్టాల పాలవ్వడంతో కొంత రెమ్యునరేషన్ వెనక్కు తిరిగి ఇచ్చేశాడు. సో విజయ్ రెమ్యునరేషన్ ఇప్పుడు రు. 7-8 కోట్ల మధ్యలో నడుస్తోంది.