Gossipsజూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఎంత క‌ట్నం ఇచ్చారో తెలుసా...!

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఎంత క‌ట్నం ఇచ్చారో తెలుసా…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాలు అనే గ్లామ‌ర్ ఫీల్డ్‌లో ఉన్నా కూడా ఎన్టీఆర్ వ్య‌క్తిగ‌త జీవితంలో ఎప్పుడూ లిమిట్స్ దాట‌డు.. పెద్ద‌ల మాట జవ‌దాట‌డు. ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లో ఎన్టీఆర్ ఎంత క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటాడో… త‌న వృత్తి ప‌ట్ల ఎంత నిబద్ధ‌త‌తో ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ త‌రంలో ఉన్న స్టార్ హీరోలు అంద‌రూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఎన్టీఆర్ మాత్రం పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మే చేసుకున్నాడు.

ఇక ఎన్టీఆర్ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త నార్నే శ్రీనివాస‌రావు కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని 2011లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తికి త‌క్కువ వ‌య‌స్సులోనే ఎన్టీర్‌తో వివాహం అయ్యింది. ఈ ఇద్ద‌రు దంప‌తుల‌కు ఇద్ద‌రు మ‌గ పిల్ల‌లు అన్న విష‌యం తెలిసిందే. ఇక ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి  త‌ల్లి మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు చంద్ర‌బాబుకు స్వ‌యానా మేన‌కోడ‌లు.

ఇక ఎన్టీఆర్‌కు నార్నే శ్రీనివాస‌రావు రు. 500 కోట్ల క‌ట్నం ఇచ్చార‌ని టాక్‌. ఇందులో స్థిర చ‌రాస్తులు చాలానే ఉన్నాయి. నార్నే శ్రీనివాస‌రావు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్తే కాకుండా ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయ‌న‌కు ఒక కుమారుడు, కుమార్తె ప్ర‌ణ‌తి ఉన్నారు. ఇక ఎన్టీఆర్‌కు భ‌విష్య‌త్తులో కూడా మామ నుంచి భారీ ఆస్తులు వ‌స్తాయ‌ని టాక్‌..?

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news